‘BLACK DAY’ నేపథ్యంలో గోదావరిఖనిలో ఆకస్మిక తనిఖీలు

December 6, 2025 5:56 PM

బాబ్రీ మస్జిద్ ధ్వంస దినం (‘బ్లాక్ డే’) నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు పట్టణంలో ఆకస్మిక వాహనాల తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రత పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి తెలిపారు.

ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ ల ఆధ్వర్యంలో గాంధీ చౌక్, రమేష్ నగర్, తిలక్ నగర్ 5 ఇంక్లైన్, అడ్డంగుంటపల్లి, మార్కండేయ కాలనీ, బస్ స్టాండ్ ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి.
పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రయాణికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను సోదాలు చేసి వివరాలు నమోదు చేశారు.

ప్రధాన జంక్షన్‌లు, కాలనీలు, మసీదులు, ముఖ్యమైన ప్రాంతాల చుట్టూ కఠిన నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వాహన తనిఖీలలో ఎస్సైలు రమేష్, భూమేష్, అనూష, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media