మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాందార్ సహా వివిధ హోదాలకు చెందిన మొత్తం 12 మంది మావోయిస్టులు ఆయుధ విరమణ ప్రకటించి లొంగిపోయారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాందార్తో పాటు డివిసిఎం (DVCM), ఏసిఎం (ACM) స్థాయి నాయకులు మరియు పార్టీ సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన వీరంతా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీకి (MMC) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ లొంగుబాటుతో ఛత్తీస్గఢ్, ఎంఎంసీ జోన్లో మావోయిస్టుల కార్యకలాపాలు మరింత బలహీనపడే అవకాశం ఉంది.
