Telengana గెలిస్తే అభివృద్ధి చేస్తా లేదంటే చెప్పుల దండ వేస్తా రాజీనామా చేస్తా

December 8, 2025 11:19 AM

ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేసే సంస్కృతికి భిన్నంగా, కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి గుమ్మడవెల్లి రాజేశ్వరి (వైశాలి) వినూత్న ప్రచారానికి తెరలేపారు.

పేదింటి నుండి పోరాటం వరకు కష్టాల నుండి కార్యదీక్ష వరకు.

పని ఏదైనా పట్టు వదలకుండా
ప్రాణాలకు లెక్క చెయ్యకుండా.

పుట్టిన నెల కోసం
పేద ప్రజల కోసం విద్యార్థుల కోసం
యువత కోసం తన మన బేధం లేకుండా మన అందరి శ్రేయస్సు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం.

మనమంతా కుటుంబ సభ్యులుగా ఉండే మన చెంజెర్ల ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికి
మీ ముందుకు వస్తున్నాను.

పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి
మన చెంజెర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలించగలరని నా ప్రార్థన.

     సదా మీ ఇంటి బిడ్డ
       _ రాజేశ్వరి  ( వైశాలి)_
         సర్పంచ్ అభ్యర్థి

రాజేశ్వరి వినూత్న వాగ్దానం:
‘విజన్’ బాండ్‌పేపర్: రాజేశ్వరి తన విజన్ మరియు అభివృద్ధి హామీలను వివరిస్తూ బాండ్‌పేపర్‌ను విడుదల చేశారు.
గ్రామంలో 12 పడకల ఆసుపత్రి, ఓపెన్ జిమ్, అంగన్వాడీ కేంద్ర అభివృద్ధి, బోర్ల మరమ్మత్తు, కూరగాయల మార్కెట్, గ్రంథాలయం అభివృద్ధి, మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం వంటి 12 కీలక హామీలను పొందుపరిచారు. తాను ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయబోనని స్పష్టం చేస్తూ, గ్రామాభివృద్ధి కోసం ఆశీర్వదించాలని కోరారు.

శపథం: తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ఆ నేరం తనపైనే వేసుకుంటానని రాజేశ్వరి పేర్కొన్నారు.బాండ్‌పేపర్‌లో పేర్కొన్న అభివృద్ధి పనులు చేయనట్లయితే, కులానికో చెప్పు చొప్పున దండ తయారు చేయించుకొని మెడలో వేసుకుని, తన పదవికి రాజీనామా చేస్తానని శపథం చేశారు.రాజేశ్వరి విడుదల చేసిన ఈ బాండ్‌పేపర్ స్థానికంగానే కాక, వివిధ ప్రాంతాల్లో వైరల్‌గా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media