AP :VIZAGలో ‘విష సంస్కృతి’ ఓపెన్ లిక్కర్ పార్టీపై ప్రజల ఆగ్రహం

December 8, 2025 11:47 AM

విశాఖ నగరంలో మరోసారి ‘విష సంస్కృతి’ మొదలైందని, ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే బహిరంగంగా మద్యం పార్టీలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘కార్తీక్ కాలింగ్’ అనే పేరుతో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌లో ఓపెన్ లిక్కర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో యువత మద్యం మత్తుతో చిందులు వేయడం బహిరంగంగా కనిపించింది.
ఈవెంట్‌లు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ, మామూళ్ల మత్తులో విశాఖ పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నా, సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) భాగ్చి పర్యవేక్షణలో కూడా పోలీసులు కక్కుర్తికి పాల్పడుతున్నారంటూ ప్రజలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ ప్రజలు ఈ తరహా మద్యం పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media