ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ‘ఛలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్’ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితులు మెయిన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఆర్-కార్డు (R-Card) కలిగి ఉన్న ప్రతీ కుటుంబానికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కల్పించాలి. లేనిపక్షంలో వారికి తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలి. వన్ టైం సెటిల్మెంట్ (One Time Settlement) చేసే వరకు, జీవనభృతి చట్టాన్ని అనుసరిస్తూ ఆర్-కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ. 25 వేలు చెల్లించాలి.ఉక్కు నిర్వాసితులు భారీగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ హక్కుల కోసం డిమాండ్ చేశారు.
