గంగవరం పోర్టు గేటు వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు పోర్టు యాజమాన్యం బకాయిపడ్డ డబ్బులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోర్టు నిర్వాసితులు ఆందోళన చేపట్టారు.
గంగవరం పోర్టు నిర్వాసితులు బకాయిలు చెల్లించాలని కోరుతూ పోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన చేపట్టారు.
నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు, గంగవరం నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది.
పోర్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలు, చెల్లించాల్సిన పరిహారం బకాయిలను వెంటనే విడుదల చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.పోర్టు గేటు వద్ద భద్రతను పటిష్టం చేసిన పోలీసులు, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
