గుంటూరు జిల్లా, పొన్నూరు: అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో పొన్నూరు రూరల్ ఎస్సై కిరణ్ బాబును వీఆర్ (Vacation Reserve) కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కిరణ్ బాబు, పొన్నూరు రూరల్ ఎస్సై. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు వీఆర్‌కు అటాచ్. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు.
గత ఆదివారం ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అవినీతిని సహించబోమని జిల్లా ఎస్పీ సంకేతాలు ఇచ్చారు.
