గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి పలు డివిజన్లలో సుమారు రూ. 8.50 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేశారు.
పశ్చిమ గుంటూరు నియోజకవర్గం, 22వ డివిజన్ (60 ఫీట్ రోడ్, అచ్చయ్య డాబా సెంటర్), 19వ డివిజన్ (నల్లచెరువు 8th లైన్), 36వ డివిజన్ (భాగ్యనగర్ 1st లైన్), 52వ డివిజన్ (అరండలపేట 1st లైన్) పరిధిలో పనులు చేపట్టారు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, మరియు బీటీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది.
అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
