జిల్లాలోని 12 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను డిసెంబర్ 10వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు.
డిసెంబర్ 10 నుంచి 21 వరకు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 26,248 మంది. విశాఖ జిల్లాలో 11 కేంద్రాలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో ఒక కేంద్రం సహా మొత్తం 12 కేంద్రాలు.
ఉదయం (9:30 AM – 12:00 PM), మధ్యాహ్నం (2:30 PM – 5:00 PM), రెండు పూటలా పరీక్ష ఉంటుంది.
డీఈవో ప్రేమ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, తాగునీరు, వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అభ్యర్థుల సహాయం కోసం డీఈవో కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ (ఫోన్ నెంబర్లు: 9177292969, 9618584051, 8328524861) ఏర్పాటు చేశారు.
