కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన అందిస్తామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన అయినవిల్లి మండలంలోని పొట్టిలంక, కొండుకుదురు గ్రామాలలో “వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లోన్లు, పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి.
ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొండుకుదురులో సర్పంచ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వినూత్నంగా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.
