Telengana బెజ్జంకిని కరీంనగర్‌లో కలుపుతాం”: హామీ పత్రం సమర్పించిన SARPANCH అభ్యర్థులు

December 9, 2025 5:15 PM

జిల్లాల పునర్విభజన కారణంగా సిద్దిపేట జిల్లాలో చేరిన బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తామని కోరుతూ, సర్పంచ్ అభ్యర్థులు హామీ పత్రాలను సమర్పిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా పోరాట సమితి పిలుపు మేరకు, సర్పంచ్ అభ్యర్థులు ఈ హామీ పత్రాలను ఇస్తున్నారు. బెజ్జంకి మండలం సర్పంచ్ అభ్యర్థి సంగ రవి కూడా హామీ పత్రాన్ని అందించారు. జాతీయ జనగణన లోపు ఈ మండలాన్ని తిరిగి కరీంనగర్‌లో కలిపేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, రెండు జిల్లాల కలెక్టర్లకు తీర్మాన పత్రాలతో కూడిన లేఖను అందిస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు.
డబ్బు, మద్యానికి ఆశపడకుండా, హామీ ఇచ్చిన వారికే ఓటు వేయాలని బెజ్జంకి పోరాట సమితి ప్రజలకు పిలుపునిచ్చింది. “బ్రాండ్ కరీంనగర్ జిల్లాను సాధించుకోవడమే మన లక్ష్యం,” అని వారు స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media