పిల్లాపాపలను పట్టించుకోకుండా తరచుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుందనే కారణంతో జరిగిన గొడవ, దారుణ హత్యకు దారితీసింది. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి కూతురే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కొర్రా పుట్టన్న, కొర్రా దేవి (భార్య) తరచుగా ఫోన్లు మాట్లాడుతూ పిల్లలను పట్టించుకోకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త, కొడుకు నిద్రిస్తున్న సమయంలో భార్య కొర్రా దేవి గొడ్డలితో కొర్రా పొట్టన్నపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పొట్టన్నను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మా నాన్నను మాకు దూరం చేసిన మా తల్లికి శిక్ష వేయాలి’ అని కోరుతూ వారి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
