నగరంలోని కంబాలకొండ అభయారణ్యం నుంచి తరచుగా రోడ్డుపైకి వస్తుండే జింకల్లో మరొకటి బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఎండాడ జాతీయ రహదారిపై ఆకస్మికంగా రోడ్డు దాటుతుండగా, అటుగా వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతో జింక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఎండాడ జాతీయ రహదారి ,కంబాలకొండ అడవి నుంచి జింకలు రోడ్డుపైకి రావడంతో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. జింక అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
