ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఘాట్ మార్గంలో లోయలో పడిపోయింది.
బుధవారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు మారేడుమిల్లి ఘాట్‌లో అదుపు తప్పి లోయలో పడిపోయింది.క్షతగాత్రులను పరామర్శించిన HOME MINISTER అనిత
