కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై గత రాత్రి దాడి జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కారంపొడి చల్లి దాడి చేశారు.
గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించి వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది.తన గెలుపు తథ్యం అయిన నేపథ్యంలో రాజకీయ కుట్రతోనే ఈ దాడి జరిగిందని దండు కొమురయ్య ఆరోపిస్తున్నారు.
దాడి తర్వాత గ్రామస్థుల సహాయంతో ఆసుపత్రికి వెళ్లినట్లు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెబుతున్నప్పటికీ, తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొంటున్నారు.
ఈ దాడి ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది.
