ఈ నెల 16వ తేదీన (రేపు) ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) 6వ బెటాలియన్లో నిర్వహించనున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ట్రైనింగ్ డీఐజీ శ్రీ సత్య యేసు బాబు ఐపీఎస్ గారు, మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా గారు నేడు (డిసెంబర్ 14, 2025) ఏర్పాట్ల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.స్టేజీ నిర్మాణం, సభా వేదిక వద్ద కార్డన్, రాకపోకల మార్గాలు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించారు.

వీఐపీ, వీవీఐపీ భద్రతను దృష్టిలో ఉంచుకుని సభా వేదిక వద్ద ఇన్నర్ మరియు ఔటర్ కార్డన్ బందోబస్తు ఏర్పాట్లపై చర్చించి, తగిన సంఖ్యలో పోలీస్ సిబ్బందిని నియమించాలని ఎస్పీ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు.

