ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం (డిసెంబర్ 14, 2025) జరిగిన కాల్పుల ఘటనను అధికారులు అధికారికంగా ఉగ్రదాడిగా ప్రకటించారు. యూదుల పండుగ హనుక్కా వేడుకల్లో పాల్గొన్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణ సామూహిక కాల్పులు జరిగాయి.ఈ దాడిలో ఒక గన్‌మెన్‌తో పాటు ఒక చిన్నారి సహా మొత్తం 16 మంది మరణించారు, సుమారు 40 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

న్యూ సౌత్ వేల్స్ ముఖ్యమంత్రి ఈ దాడిని హనుక్కా వేడుకల కోసం సమావేశమైన యూదుల (JEWS)సమాజాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు.ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఈ చర్యను “చెడు యూదు వ్యతిరేకత, ఉగ్రవాదంగా ఖండించారు. జాతీయ స్థాయిలో కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు ప్రకటించారు.

ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అధికారులు తండ్రీకొడుకులుగా గుర్తించారు సాజిద్ అక్రమ్ (50)తండ్రి, ఇతను సంఘటన స్థలంలో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. నవీద్ అక్రమ్ (24): కొడుకు, ఇతను గాయపడి ఆసుపత్రిలో పోలీసుల పహారాలో చికిత్స పొందుతున్నాడు.వీరి వాహనం నుంచి ఇస్లామిక్ స్టేట్ (IS) జెండాలు లభ్యం కావడంతో ఇది ఉగ్రవాద కుట్రగా పోలీసులు నిర్ధారించారు,వీరు ఇద్దరు పాకిస్థాన్ కి చెందిన వారిగా గుర్తించారు.
