పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో అతివేగంతో వచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ లారీని అదుపు చేయలేక కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టాడు.
సత్తెనపల్లి మండలం, నందిగామ గ్రామం లారీ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభం విరిగిపోయినప్పటికీ, తృటిలో పెను ప్రమాదం తప్పింది.
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
