రాష్ట్రంలో ఐటీ, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో రూపొందించిన ‘నైపుణ్యం పోర్టల్’ గురించి లోకేష్ వివరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్రం సహాయం అందించాలని కోరగా, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.

యువ పారిశ్రామికవేత్తలకు అద్భుత వేదికగా ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు (MeitY) స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. AVGC-XR మరియు WAVEX ఫ్రేమ్‌వర్క్ కింద యానిమేషన్, AR/VR వంటి అంశాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఇండియా AI మిషన్ కింద రాష్ట్రంలో AI విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని కూడా కోరారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

