జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు నాగేంద్రబాబు (టవర్ స్టార్ నాగబాబు) సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం MLA నడుకుదిటి ఈశ్వరరావు నివాసానికి వెళ్లారు.MLA ఈశ్వరరావు కుటుంబం నాగబాబుకు సాదరంగా స్వాగతం పలికి, ఆత్మీయ సత్కారం చేసింది.ఈ సందర్భంగా నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.
కూటమి నాయకులను MLA నాగబాబుకు పరిచయం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి నడవాలని ఇద్దరు నాయకులు నిర్ణయం తీసుకున్నారు.ఈ భేటీ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, టీడీపీల మధ్య సహకారం మరియు సమన్వయాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
