గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది (Winter Sojourn) లో భాగంగా ఈ నెల 17 (నేటి) నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

డిసెంబర్ 17 నుంచి 21 వరకు (ఐదు రోజులు) రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. పోలీసు శాఖ భద్రతా, ట్రాఫిక్ ప్రణాళికలు సిద్ధం చేయాలని; అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖల బృందాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
రోడ్ల మరమ్మతులు, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడద, తేనెటీగల నియంత్రణకు ప్రత్యేక బృందాలను నియమించాలి.24 గంటలు స్నేక్ క్యాచర్ బృందం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
