ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ కోసం మినీ వేలం అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో ఆటగాళ్ల కొనుగోలుకు 10 ఫ్రాంచైజీలు మొత్తం రూ. 237.55 కోట్లు ఖర్చు చేశాయి.
వేలంలో 350 మంది ఆటగాళ్లు పాల్గొనగా, అందుబాటులో ఉన్న కేవలం 77 స్లాట్‌లకు మాత్రమే ఆటగాళ్లు ఎంపికయ్యారు.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అతన్ని రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది.

గ్రీన్ తన స్వదేశీయుడు మిచెల్ స్టార్క్ (2024లో KKR రూ. 24.75 కోట్లకు కొనుగోలు) రికార్డును బద్దలు కొట్టాడు.
40 మంది ఆటగాళ్లకు అత్యధిక బేస్ ధర రూ. 2 కోట్లుగా ఉండగా, మిగిలిన 227 మంది ఆటగాళ్లకు అత్యల్పంగా రూ. 30 లక్షలుగా ఉంది.
