కొమురంభీమ్ జిల్లాలోని సిర్పూర్ పట్టణంలో భారీ సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.
సిర్పూర్‌లోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నాయి.

వీరంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి లొంగిపోయేందుకు (Surrender) వచ్చినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పట్టుబడ్డ వారు ఏ దళానికి చెందినవారు? లొంగిబాటు లక్ష్యంతోనే వచ్చారా లేదా ఇతర వ్యూహాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
