AP A.N.R కళాశాల వజ్రోత్సవాల్లో ‘కింగ్’ నాగార్జున సందడి

December 17, 2025 3:35 PM

అక్కినేని నాగేశ్వరరావు (ANR) పుట్టిన గడ్డ గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు రెండో రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు అక్కినేని నాగార్జున, తన తండ్రి స్థాపించిన విద్యాసంస్థపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.

విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం అక్కినేని కుటుంబం తరపున రూ. 2 కోట్ల నిధిని నాగార్జున ప్రకటించారు. ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తామని హామీ ఇచ్చారు.నాన్న పుట్టిన గడ్డకు రావడం ఎంతో భావోద్వేగంగా ఉంది. ఆయన రైతు బిడ్డ అయినా చదువుపై ఉన్న మక్కువతో 1951లోనే లక్ష రూపాయలు విరాళమిచ్చి ఈ కళాశాల స్థాపించారు” అని నాగార్జున గుర్తుచేసుకున్నారు.

ఈ వేడుకలో హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. “ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుడివాడ అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ అని గర్వంగా చెప్పుకుంటాం. నాగార్జున ఇచ్చిన రూ. 2 కోట్లను విద్యార్థుల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేస్తాం” అని MLA వెనిగండ్ల రాము పేర్కొన్నారు.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ పుస్తకాన్ని నాగార్జున ఆవిష్కరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media