నగర అభివృద్ధిలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళ మాధవి గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.గుంటూరు కార్పొరేషన్ 45వ డివిజన్ ముత్యాల రెడ్డి నగర్ పదో లైన్లో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే గళ్ళ మాధవి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు భారతీయ జనతా పార్టీ (BJP) మూడో మండల అధ్యక్షురాలు శ్రీమతి గాయత్రి బెహరా గారు కూడా పాల్గొన్నారు. డివిజన్లోని ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్పొరేషన్ అధికారులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
AP GUNTUR ముత్యాల రెడ్డి నగర్లో సిమెంట్ రోడ్డు ప్రారంభించిన MLA గళ్ళ మాధవి
