AP :YS Jagan Meet Governor Today: APలో మెడికల్ కాలేజీల కోసం YSRCP సమరం

December 18, 2025 4:06 PM

Ap మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఎస్‌. అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఆయన గవర్నర్‌కు అందజేయనున్నారు.

ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇవి నేరుగా విజయవాడలోని లోక్‌భవన్‌కు చేరుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ సీనియర్ నేతలతో కలిసి జగన్ గవర్నర్‌ను కలుస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య, సామాన్యులకు ఉచిత వైద్యం దూరమవుతుందని గవర్నర్‌కు వివరించనున్నారు.

10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ రంగంలోనే వీటిని కొనసాగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. గవర్నర్‌ను కలవడానికి ముందు జగన్ తన పార్టీ కీలక నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media