ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు దేశ రాజధానిలో బిజీబిజీగా గడపనున్నారు. పోలవరం, అమరావతి మరియు రాష్ట్ర ఆర్థిక అంశాలపై చర్చించేందుకు ఆరుగురు కీలక కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు.జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ (ప్రధాన అజెండా: పోలవరం నిధులు).

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం (రాష్ట్ర విభజన హామీలు, భద్రతా అంశాలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ (బడ్జెట్ మద్దతు, పెండింగ్ బకాయిలు).
ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో భేటీ (పోర్టుల అభివృద్ధి).ఢిల్లీలో నిర్వహించే ‘క్రెడాయ్ (CREDAI) అవార్డుల’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు.

పెట్రోలియం, రహదారి రవాణా శాఖ మంత్రులతో కూడా సీఎం సమావేశమై రాష్ట్రంలోని ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు కీలక ప్రాజెక్టుల ఆమోదంపై ఈ పర్యటనలో సానుకూల నిర్ణయాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది.

