కన్నడ ‘రియల్ స్టార్’ ఉపేంద్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. రజనీకాంత్‌తో కలిసి పనిచేయడంపై ఆయన మాట్లాడుతూ, “ఆయన నాకు ద్రోణాచార్యుడు అయితే, నేను ఆయనకు ఏకలవ్యుడిని” అని అభివర్ణించారు. రజనీకాంత్ సరసన ‘కూలీ’ చిత్రంలో నటించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.

రజనీకాంత్ స్టైల్, నటనను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయనను చూస్తూ పెరిగిన తనకు ఇప్పుడు ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మర్చిపోలేని అనుభూతినిస్తోందని ఉపేంద్ర తెలిపారు.

శివరాజ్‌కుమార్ మరియు రాజ్ బి శెట్టిలతో కలిసి ఉపేంద్ర నటిస్తున్న భారీ చిత్రం ’45’. దీనికి అర్జున్ జన్యా దర్శకత్వం వహిస్తున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ’45’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పాటు ఉపేంద్ర తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘UI’ మూవీ పనుల్లో కూడా బిజీగా ఉన్నారు.
