TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జనవరి 2 నుంచి ప్రారంభం

December 23, 2025 11:09 AM

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలను జనవరి 2, 2026 నుంచి నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం మంత్రులతో జరిగిన కీలక భేటీలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నూతన సంవత్సరంలో జరిగే ఈ మొదటి సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

త్వరలో జరగనున్న MPTC, ZPTC మరియు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారుపై సభలో సుదీర్ఘ చర్చ జరగనుంది.స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలు, ఏపీతో ఉన్న వివాదాలపై చర్చించేందుకు కేసీఆర్‌ను సభకు రావాలని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కుల గణన ఫలితాల ఆధారంగా అమలు చేయబోయే సంక్షేమ పథకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media