AP :Vizagలో Ysrcpలోకి భారీ చేరికలు: వాసుపల్లి గణేష్ కుమార్

December 24, 2025 11:14 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వప్రయోజనాల కోసం పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆసీల్‌మెట్టలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. విశాఖలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కూటమి నేతలు కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారని వాసుపల్లి ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేదలకు ఉచిత వైద్యం కోసం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, నేటి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతూ పేదలకు వైద్యాన్ని దూరం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, జగన్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
30వ వార్డు ప్రెసిడెంట్ దశమంతలు మాణిక్యాలరావు ఆధ్వర్యంలో, టీడీపీ నాయకురాలు యార్ణమ్మతో సహా వంద మంది వైసీపీ కండువా కప్పుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media