కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని బుధవారం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ (TTD) అధికారులు సాదర స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ విజేత పీవీ సింధు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Ex M.P పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేసి గౌరవించారు. ఆలయం వెలుపల అభిమానులు పీవీ సింధుతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.
