ప్రేమ, క్షమ, త్యాగం అనే విలువలే క్రిస్మస్ పండుగ సందేశమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం సూర్యాబాగ్ ప్రాంతంలోని ట్రినిటీ లూథరన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించడం ద్వారా అహంకారం కంటే వినయమే గొప్పదని ప్రపంచానికి చాటారని స్పీకర్ కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రైస్తవ సంక్షేమానికి కట్టుబడి ఉందని, చర్చిల నిర్మాణం మరియు పండుగ కానుకల విషయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో డాక్టర్ ఎన్. జేసు రత్నకుమార్, చర్చి పాస్టర్లు, కన్వీనర్ సుష్ బాబు, కో-కన్వీనర్ వి.ఎన్. మూర్తి మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
AP Vizagలో క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథి అయ్యన్నపాత్రుడు
