నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండా వెంకటప్పయ్య కాలనీలో పోలీసులు భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెల్లవారుజాము నుంచే వందలాది మంది పోలీసులు కాలనీని చుట్టుముట్టి అణువణువు గాలించారు.

ప్రతి ఇంటిని సోదా చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, రౌడీ షీటర్లను ఎస్పీ తనదైన శైలిలో హెచ్చరించారు. నగరంలో అసాంఘిక శక్తులకు తావులేదని, ఎవరైనా తోక జాడిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నేరరహిత సమాజం కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. కాలనీల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
