గుంటూరు జిల్లా పొన్నూరులో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి వేడుకలను రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు.

వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ధూళిపాళ్ల మరియు ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే రంగాకు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు, పలువురు బీజేపీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
