Unnao అత్యాచార కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన దోషి, మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ జైలు శిక్షను కోర్టు నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీ హైకోర్టు వెలుపల భారీ నిరసన ప్రదర్శన జరిగింది. అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం (AIDWA) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త యోగితా భయానా మరియు అత్యాచార బాధితురాలి తల్లి పాల్గొన్నారు.

దోషి బయట ఉంటే తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని నిరసనకారులు ప్లకార్డులతో నినాదాలు చేశారు.
