అన్నమయ్య జిల్లా కేంద్రం అంశం మళ్ళీ చిచ్చు రేపుతోంది. రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మార్చవద్దంటూ స్థానిక ప్రజలు, మేధావులు మరియు రాజకీయ నాయకులు ఐక్యంగా నినదిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలతో రాయచోటిలో ఆందోళనలు మొదలయ్యాయి.

రాయచోటిలో ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయి, వీటిని మార్చడం ప్రజాధనం వృధా చేయడమే.జిల్లా కేంద్రంగా రాయచోటి భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉందని స్థానికుల వాదన.మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం రాయచోటి ప్రయోజనాల కోసం కేబినెట్లో గళమెత్తారు.
