6.OG :తెలుగు
పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ ప్రపంచవ్యాప్తంగా ₹293.65 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో రికార్డు స్థాయి ప్రీమియర్లతో విదేశీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. 1940ల నాటి జపాన్ నుండి 1990ల ముంబై వరకు సాగే ఈ కథలో ఓజస్ గంభీర (OG) అనే గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ నటించారు.

7.L2: ఎంపురాన్ (Empuraan)Malayalam
‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘L2: ఎంపురాన్’లో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సుమారు ₹175 కోట్ల బడ్జెట్తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా ₹266.81 కోట్లు వసూలు చేసింది.

8.సంక్రాంతికి వస్తున్నాం(telugu)
జనవరి 2025లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి ₹255.2 కోట్లు వసూలు చేసింది. వెంకటేష్ దగ్గుబాటి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇందులో నటించారు.

9.Su From So (kannada)
సు ఫ్రమ్ సో (Su From So) ఈ కన్నడ హారర్ కామెడీ-డ్రామా 2025లో బాక్సాఫీస్ వద్ద ఒక ‘డార్క్ హార్స్’ (అనూహ్య విజేత)గా అవతరించింది. అటు విమర్శకుల ప్రశంసలు, ఇటు కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా మార్లూరు అనే తీరప్రాంత గ్రామం నేపథ్యంలో సాగుతుంది.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹122.83 కోట్లు వసూలు చేసింది.

10.తుదరుమ్ (Thudarum),
లెజెండరీ నటులు మోహన్ లాల్ మరియు శోభన 15 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో మళ్ళీ జతకట్టారు. పాతనంతిట్ట కొండ ప్రాంతంలో ఉండే ఒక టాక్సీ డ్రైవర్, తన అంబాసిడర్ కారుపై ఉండే మక్కువ నేపథ్యంతో ఈ కథ సాగుతుంది ఒక డ్రగ్స్ కేసులో పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹234.5 కోట్లు వసూలు చేసింది.

