ఉత్తరా ఖండ్‌లోని అల్మోరా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్థులు ప్రాణాలకు తెగించి లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల నుంచి గాయపడిన వారిని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
