AP మందికి మంగళవారం,నీకుఏమో సోమవారం Tdp భూకేటాయింపు

January 2, 2026 12:15 PM

రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు, బాపట్ల, కోనసీమ మరియు విశాఖపట్నం జిల్లాల్లో వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏలూరు జిల్లా నూజివీడు లో ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్’ (IIPM) ఏర్పాటుకు 9.96 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని ఉద్యాన, పట్టు శాఖకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఉచితంగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వేదాంత లిమిటెడ్‌కు లీజు: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఆన్‌షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం వేదాంత లిమిటెడ్‌కు 9.88 ఎకరాల భూమిని 3 ఏళ్ల కాలానికి లీజుకు ఇచ్చింది. మార్కెట్ విలువలో 10% చొప్పున అంటే ఏడాదికి ₹15 లక్షల లీజు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ లో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరాకు ₹80 లక్షల చొప్పున మొత్తం ₹14.85 కోట్లకు ఈ కేటాయింపు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

బాపట్ల జిల్లా పశ్చిమ బాపట్లలో తెలుగుదేశం పార్టీ (TDP) జిల్లా కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించింది. ఏడాదికి ₹1,000 లీజుపై 33 ఏళ్ల కాలానికి ఈ భూమిని బదిలీ చేస్తూ జి.ఓ. నంబర్ 534 విడుదల చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media