TG :Maoism కి అంతం:చీఫ్ దేవాతో 20 మంది లొంగుబాటు

January 3, 2026 4:21 PM

తెలంగాణలో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ ఆయుధ విభాగానికి వెన్నెముక వంటి పీఎల్జీఏ (PLGA) బెటాలియన్ కమాండర్ బర్సే సుక్కా అలియాస్ దేవా మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM) కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ తమ అనుచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పిలుపునకు స్పందించి వీరు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

లొంగిపోయిన వారు తమతో పాటు భారీ ‘ఆర్మ్స్ డంప్’ను పోలీసులకు అప్పగించారు. ఇందులో 48 ఆయుధాలు ఉన్నాయి. వీటిలో 2 LMGలు, అమెరికా మేడ్ కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ మేడ్ టవోర్ రైఫిల్, 8 AK-47లు, 10 ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు మరియు 2,206 రౌండ్ల మందుగుండు సామగ్రి ఉన్నాయి. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న మావోయిస్టుల సంఖ్య ఇప్పుడు కేవలం 17కి పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీలో కేవలం ఒక్కరు మాత్రమే క్రియాశీలంగా ఉన్నట్లు సమాచారం.

నాయకత్వంలో విభేదాలు, బలవంతంగా తెలియని ప్రాంతాలకు పంపడం, కనీస అవసరాలు తీరకపోవడం మరియు ఆరోగ్యం వంటి కారణాలతో విసిగిపోయి లొంగిపోయినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం వీరికి మొత్తం ₹1,81,90,000 రివార్డు మరియు పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి ₹25,000 నగదును డీజీపీ అందజేశారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media