National :GANDHI కుటుంబంలో పెళ్లి బాజాలు

January 3, 2026 5:12 PM

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, M.Pప్రియాంక గాంధీ మరియు రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్ (Aviva Baig)తో రేహాన్ నిశ్చితార్థం జరిగినట్లు ప్రియాంక గాంధీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. రేహాన్, అవీవాలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులని, ఏడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి నిశ్చితార్థం వేడుక డిసెంబర్ 29, 2025న రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో ప్రైవేట్ వేడుకగా జరిగింది.

“మీ ఇద్దరికీ చాలా ప్రేమ.. ఎల్లప్పుడూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, కలకాలం మంచి స్నేహితులుగా ఉండండి” అని ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆకాంక్షించారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఇమ్రాన్ బేగ్, ఇంటీరియర్ డిజైనర్ నందితా బేగ్‌ల కుమార్తె అవీవా. ఆమె వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ మరియు ఫోటోగ్రాఫర్. రేహాన్ వాద్రా (25) ఒక విజువల్ ఆర్టిస్ట్ మరియు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. రాజకీయాలకు దూరంగా ఉంటూ కళారంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media