AP నిజాంపట్నం హార్బర్‌లో FIRE తగలబడిన చేపల వేట BOAT

January 3, 2026 5:22 PM

జిల్లాలోని నిజాంపట్నం హార్బర్‌లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. జెట్టీ వద్ద నిలిపి ఉంచిన ఒక భారీ చేపల వేట బోటులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. బోటులో ఉన్న డీజిల్, వలలు వంటి మండే స్వభావం గల వస్తువులు ఉండటంతో మంటలు క్షణాల్లో బోటు అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి గురైన బోటు సున్నంపూడి గోవిందరాజులు అనే మత్స్యకారుడికి చెందినదిగా గుర్తించారు. మంటల్లో బోటుతో పాటు లోపల ఉన్న ఖరీదైన వలలు, ఇతర సామగ్రి పూర్తిగా బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు ₹50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. మంటలు చెలరేగగానే బోటులో ఉన్న వారు వెంటనే కిందకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media