న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు.
స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వన్డే జట్టులోకి తిరిగి రావడం గమనార్హం. జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు.

వెన్నునొప్పి గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఎంపికపై బీసీసీఐ కండిషన్ పెట్టింది. జనవరి 6న జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో అతను తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటేనే జట్టులో కొనసాగుతాడు.
ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ, మహమ్మద్ షమీని సెలెక్టర్లు మరోసారి పక్కన పెట్టారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు.
భారత వన్డే జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ ,కేఎల్ రాహుల్ (VC& కీపర్),రిషబ్ పంత్ (వికెట్ కీపర్),శ్రేయస్ అయ్యర్ (VC ఫిట్‌నెస్‌కు లోబడి),హార్దిక్ పాండ్యా,రవీంద్ర జడేజా,అక్షర్ పటేల్,కుల్దీప్ యాదవ్,మహమ్మద్ సిరాజ్,అర్ష్‌దీప్ సింగ్,ముఖేష్ కుమార్,ప్రసిద్ధ్ కృష్ణ,వాషింగ్టన్ సుందర్
