ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పామిడిఘంటం శ్రీ నరసింహ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
జస్టిస్ P.S నరసింహ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేసి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.ఆలయ ఏఈఓ బి.వి. రెడ్డి మరియు వైదిక కమిటీ పర్యవేక్షకులు అమ్మవారికి జరుగుతున్న నిత్య పూజలు, నూతనంగా ఏర్పాటు చేసిన హోమగుండం మరియు క్షేత్రంలో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనుల గురించి న్యాయమూర్తికి వివరించారు.
విజయవాడలో జరుగుతున్న 36వ పుస్తక మహోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.
