AP రైతులకు గుడ్ న్యూస్ 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు

January 5, 2026 5:55 PM

రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వెల్లడించారు. గతంలో ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు కేవలం 24 గంటల్లోనే (కొన్ని చోట్ల 4 గంటల్లోనే) నగదు అందుతోందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన ₹1,674 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పూర్తిగా చెల్లించిందని గుర్తుచేశారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తి చేసి ₹9,300 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి ₹1,200 కోట్లు చెల్లించామని, మిగిలిన 1.50 లక్షల టన్నుల కొనుగోలు కూడా వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. రైతులకు ఉచితంగా తార్పాలిన్లు, పట్టణాల్లో ప్రయోగాత్మకంగా ₹20 కే కిలో గోధుమపిండి సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media