S.S మందిర్ గురువులు నవభారత నిర్మాతలు: బండి సంజయ్

January 6, 2026 3:04 PM

“సరస్వతి శిశు మందిర్ కేవలం ఒక పాఠశాల కాదు.. అది దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారం” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని శిశు మందిర్‌లో రెండు రోజుల పాటు జరిగే క్రీడా పోటీలను (ఖేల్ ఖుద్) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి సందడి చేశారు.

“నేను రేకుల షెడ్డు కింద ఈ స్కూల్‌లోనే చదువుకున్నా. ఇక్కడ నేర్చుకున్న సంస్కారం, దేశభక్తి వల్లే ఈ స్థాయిలో ఉన్నా. నా పిల్లలు ఇక్కడ చదవలేకపోవడం వారి దురదృష్టం” అని వ్యాఖ్యానించారు. తన పార్లమెంట్ పరిధిలోని అన్ని శిశు మందిర్‌లకు పక్కా భవనాలు నిర్మిస్తానని, 9, 10 తరగతుల విద్యార్థులందరికీ సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు అందజేస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. రూ. 5 లక్షల భరోసా కార్డులు, స్కూటీల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

“సంస్కారం + సైన్స్ + స్పోర్ట్స్ = శిశు మందిర్” అని అభివర్ణించిన ఆయన, విద్యార్థులు ఆర్మీలో చేరి దేశసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media