పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ని శాలువాతో ఘనంగా సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

పూజల అనంతరం ఎంపీ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
