రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ జిల్లా పర్యటన ప్రారంభమైంది. బుధవారం బొండపల్లి మండలం రాచకిండాంలో పర్యటించిన మంత్రి, అక్కడ జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నేరుగా రైతులతో మమేకమై, ధాన్యం సేకరణలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, మద్దతు ధర విషయంలో ఎక్కడా రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో పౌరసరఫరాల శాఖ ఎండీ ఎస్.ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేదు మాధవన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
