AP:గ్రామ అభివృద్ధికి యువత నడుం బిగించాలి అమనాం గ్రామసభ

January 6, 2026 6:18 PM

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం గ్రామపంచాయతీలో సోమవారం సర్పంచ్ దంతులూరి ఉమాదేవి అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభలో గ్రామ సమస్యల పరిష్కారం కోసం యువత చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

వికసిత భారత్ రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ల ద్వారా కలిగే ప్రయోజనాలను సచివాలయ కార్యదర్శి పులి పోలి రెడ్డి వివరించారు. పండగ వేళ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ‘స్వచ్ఛ సంక్రాంతి’పై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కంబపు శివకుమార్ ఆధ్వర్యంలో యువత గ్రామ సమస్యలను సర్పంచ్, ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో MPP తో పాటు TDP నాయకులు బాబ రాంబాబు, కొయ్య విశ్వనాథరెడ్డి, జీరు అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media