నగరంలోని నోవోటల్ హోటల్ సమీపంలో అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంతో దూసుకొచ్చిన హోండా కారు (AP31 BY 8888) నియంత్రణ కోల్పోయి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు టైరు పేలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది, అయితే అటుగా వెళ్తున్న వారు భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారును తనిఖీ చేయగా, అందులో మద్యం బాటిళ్లు, సోడా దొరికాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించే క్రమంలో యువకులు పోలీసులపైనే తిరగబడ్డారు. “మాకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి.. మమ్మల్ని ఏం చేయలేరు” అంటూ బెదిరింపులకు దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష అనంతరం కూడా “నేనేంటో చూపిస్తా” అంటూ పోలీసులను హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు.
